శ్రీముఖి అభిమానుల పైత్యం ముదిరింది..

  • In Film
  • October 16, 2019
  • 161 Views
శ్రీముఖి అభిమానుల పైత్యం ముదిరింది..

తెలుగు బిగ్‌బాస్‌ మూడవ సీజన్ తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో విజేతగా నిలవడానికి కంటెస్టంట్లతో పాటు బయట ఉన్న వారి అభిమానులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఇక టైటిల్ విజేత రేసులో ఉన్న యాంకర్,నటి శ్రీముఖి అభిమానులు సరికొత్త ఐడియాతో శ్రీముఖిని గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నగరంలోని పలు థియేటర్లలో శ్రీముఖికి ఓట్లు వేయాలంటూ ప్రకటనలు ఇప్పిస్తున్నారు.ప్రస్తుతం వీళ్లంతా హౌస్ లో పోటాపోటీగా ఆడుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని ప్రతి ఒక్క కంటెస్టంట్ కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లే బయట వారి గురించి క్యాంపైనింగ్ చేస్తున్నారు. శ్రీముఖిని గెలిపించమని ఏకంగా థియేటర్లలో యాడ్స్ కూడా వేస్తున్నారు. ‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ ఫోన్ నెంబర్ తో సహా ఒక ప్రకటనను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.ఈ ప్రకటనలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.శ్రీముఖి యాంటీ ఫ్యాన్స్ యాడ్స్పై ట్రోలింగ్ చేస్తుండడంతో పాటు శ్రీముఖికి ఓట్లు వెయ్యొద్దంటూ నెటిగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos