బాగలూరు రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదం

బాగలూరు రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదం

హొసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరులో ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతిని వెంటనే పూడ్చివేయడం ద్వారా ప్రమాదాలు నివారించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హొసూరు నుంచి బాగలూరుకు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటోంది. ఈ రహదారి ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని మాలూరు, కోలారు తదితర ప్రాంతాలకు రోజూ వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. నిత్యం వాహనాల రద్దీ కారణంగా బాగలూరు కోటమారెమ్మ దేవాలయం సమీపంలో గొయ్యి ఏర్పడింది. నెల రోజులవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ గొయ్యి గురించి తెలియని ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానికులు గొయ్యి ఉన్న చోట బారికేడ్లు అడ్డంగా ఉంచి అధికారులకు సమాచారమందించారు. అయినప్పటికీ అధికారుల్లో స్పందన లేదని స్థానికులు వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గొయ్యిని పూడ్చివేయడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos