మిద్దె కూలి ఆరుగురి మృతి

మిద్దె కూలి ఆరుగురి మృతి

బీదర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు బీదర్ జిల్లా, బసవ కల్యాణ తాలూకా చిల్లాగల్లి గ్రామంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు ఇంటి పై కప్పు కూలడంతో పండ్ల వ్యాపారి నదీమ్ షేక్ కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. తమ మట్టి ఇంట్లో మంగళవారం రాత్రి నదీమ్ తన భార్య ఫరీదా బేగం, నలుగురు పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా పై కప్పు ఒక్కసారిగా కూలింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. బుధ వారం తెల్లవారు జామున స్థానికులు మృత దేహాలను బయటికి తీశారు. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి మృతి చెందడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos