కరోనా బాధితులకు రుణాలు.. ఎస్‌బీఐ

కరోనా బాధితులకు చికిత్స కోసం రుణాలను ఇచ్చేందుకు ఎస్బీఐ స్పష్టం చేసింది. కరోనా కారణంగా చికిత్స పొందేవారికి అవసరమయ్యే మొత్తాన్ని రుణాలుగా ఇచ్చేందుకు సిద్ధమని ఎస్బీఐ ప్రకటించింది. ప్రత్యేక కేటాయింపు కింద మొత్తాన్ని రుణంగా ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. కరోనా ఎమెర్జెన్సీ స్కీమ్ కింద జూన్ 30 తేదీ వరకు అమలులో వుంటుంది. ఎస్బీఐ కస్టమర్లు కరోనా బాధితులైతే వారికి రుణాలు అఫ్పగించేందుకు ఎస్బీఐ సిద్ధంగా వున్నట్లు.. అలాంటి వారు రుణాలు పొందవచ్చునని ఎస్బీఐ ప్రకటనలో తెలిపింది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న గంటలోపు రుణాలు పొందవచ్చు.ఆరునెలల తర్వాత రుణానికి వడ్డీ కట్టడం చేస్తే చాలు. ఇంతవరకు ఇతరత్రా రుణాలు పొందిన వారు కూడా కరోనా చికిత్స కోసం రుణాలు పొందవచ్చు. ఎస్బీఐ తరహాలో ఇతర బ్యాంకులు కూడా కరోనా చికిత్స కోసం రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos