భట్టీ దీక్ష భగ్నం..

భట్టీ దీక్ష భగ్నం..

ప్రతిపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.ఇందిరాపార్క్‌ వద్ద భట్టి చేస్తున్న దీక్ష శిబిరానికి చేరుకున్న పోలీసులు బలవంతంగా భట్టిని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.భట్టిని ఆసుపత్రికి తరలించినా నిరసన దీక్షలు,ఆందోళనలు కొనసాగిస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ 36 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టిన భట్టి దాన్ని ఆమరణ నిరాహార దీక్షగా మార్చుకున్నారు.భట్టి చేపట్టిన దీక్షకు తెదేపాతో పాటు తెలంగాణ జనసమితి పార్టీ నేతలు కూడా మద్దతు తెలిపారు. తెజాస అధ్యక్షుడు కోదండరామ్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు దీక్ష శిబిరానికి చేరుకొని భట్టికి మద్దతు తెలిపారు.36 గంటలుగా దీక్ష చేస్తున్న భట్టి ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఉదయం పోలీసులు భట్టిని బలంవంగా నిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో సైతం భట్టి దీక్షను కొనసాగిస్తున్నారు.కర్ణాటక ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్‌ సైతం భట్టి విక్రమార్క దీక్ష శిబిరానికి చేరుకొని తెరాస అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos