ప్రశాంత్ భూషణ్ వ్యాజ్యం విచారణ వాయిదా

ప్రశాంత్ భూషణ్ వ్యాజ్యం విచారణ వాయిదా

న్యూ ఢిల్లీ: ప్రముఖ న్యాయవాది , సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసును విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని మంగళవారం ప్రధాన న్యాయమూర్తికి విన్నవించింది. తనను దోషిగా ప్రకటించిన వ్యాజ్యంలో తాను క్షమాపణ చెప్పేది లేదని, సుప్రీం తీర్పునకు కట్టుబడి ఉంటానని ప్రశాంత్ భూషణ్ సోమవారం కుండ బద్దలు కొట్టారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 10కి వాయిదా పడింది. ‘నా చేతిలో ఎక్కువ వ్యవధి లేదు. నేను త్వరలోనే పదవీ విరమణ చేయనున్నాను. నాలుగైదు గంటల సమగ్ర విచారణ అవరం’ అని న్యాయమూర్తి అరుణ్ మిశ్ర కేసును మరో ధర్మాసనానికి బదిలీ సినపుడు పేర్కొన్నారు. ‘స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, సుమోటోగా తీసుకునే ధిక్కరణ అధికారాల మధ్య సందిగ్ధతపై సుదీర్ఘ విచారణ అవసరం. ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన చట్టపరమైన ప్రశ్నలను రాజ్యాంగ ధర్మాసనంలోనే విచారించాల’ని ప్రశాంత్ భూషణ్ న్యాయవాది రాజీవ్ ధావన్ విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos