బెల్ట్ షాపులు మాత్రం మూసివేయాల్సిందే

బెల్ట్ షాపులు మాత్రం మూసివేయాల్సిందే

నల్గొండ : బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం మునగోడులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను మద్యపానానికి వ్యతిరేకం కాదని, మద్యం ఎక్కడబడితే అక్కడ దొరకడంతో చాలా ఎఫెక్ట్ అవుతోందన్నారు. గ్రామాల్లో నాయకులందరూ ఏకమై బెల్టు షాపు లేకుండా చేయాలని సూచించారు. ఈ విషయంలో తన పదవి పోయినా పర్వాలేదని… బెల్ట్ షాపులు మాత్రం మూసి వేయాల్సిందేనని అన్నారు. ఈ ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలని, ప్రతి గ్రామంలో పది మందితో ఒక కమిటీ వేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos