భాగ్యనగరంలో ఏరులై పారుతున్న బీరు

భాగ్యనగరంలో ఏరులై పారుతున్న బీరు

హైదరాబాదు: రాష్ట్రంలో భానుడు నిప్పులు గక్కుతుంటే వేసవితాపం, వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. దాహార్థిని తీర్చుకునే క్రమంలో కాసి న్నిచల్లని నీళ్లు దొరికితే చాలనుకుంటున్నారు. మందుబాబు మాత్రం చల్లచల్లని బీర్లను తెగ తాగేస్తున్నారని అబ్కారి శాఖ తాజా నివేదిక తేల్చింది. దీని ప్రకారం హైదరాబాద్ లో రోజుకు 10 లక్షల లీటర్లకు పైగా బీర్లును లాగిస్తున్నారు. వారాంతంలో ఎక్కువగా యువత బిర్ల వైపే మొగ్గు చూపుతున్నారట. వారాంతాల్లో అమ్మకాలు అమాంతంగా పెరుగుతున్నాయ. ఐటీ, బీపీఓ, రియాల్టీ సేవా రంగాల్లో పనిచేస్తున్నవారు సైతం వీకెండ్ పార్టీలో ఎక్కువశాతం చల్లచల్లని బీర్లను చప్పరిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు. బీర్లను ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో బీరుపై అదనంగా రూ. 20 నుండి రూ. 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నట్లు మద్యం ప్రియులు చెబుతున్నారు. విదేశీ బీర్లపై 50 నుంచి 100వరకు అధికంగా వసూలు చేస్తుండటంతో ప్రస్తుతం ఒక్కో బీరు సీసా ధర రూ.300 కు పెరిగింది. విపరీతంగా బీరు సేవనం వల్ల పాన ప్రియులు ఆనారోగ్య సమస్యల్ని ఎదిరించక తప్పదని వైద్యుల హెచ్చరించారు. వేసవిలో బీరులో ఉండే ఆల్కాహాల్ పర్సంటేజ్ ఎక్కువైతే కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం, మొద్దు బారిపోవడంతో పాటు, మెదడుపై ప్రభావం పడి ఆలోచన శక్తితగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు ఎక్కువసార్లు మూత్రవిసర్జన వల్ల శరీరంలోని సోడియం, పొటాషియం బయటికు వెళ్లే ప్రమాదం ఉదంటున్నారు. రోజుకు 90 మి.లీ కంటే ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకుంటే కాలేయంపై నేరుగా ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos