బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ

బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఇక్కడ జరిగిన మండలి సమావేశం సెక్రటరీగా మరోసారి జైషానే ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఇప్పటి వరకు ట్రెజరర్ గా పనిచేసిన అరుణ్ ధుమాల్ నూతన ఐపీఎల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. రోజన్ బిన్నీ 1983లో భారత్ కు ప్రపంచ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్ నైపుణ్యాలతో (రైట్ ఆర్మ్ మీడియం పేసర్) 18 వికెట్లు తీసి, విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్ లో భారత్ తరఫున 27 టెస్ట్ మ్యాచుల్లో, 72 వన్డే మ్యాచుల్లో పాల్గొన్నారు. నేషనల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 67 ఏళ్ల బిన్నీ స్వస్థలం బెంగళూరు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos