బారిస్టర్ చదివిండంట… ఎందుకయ్యా బొంద పెట్టుకోవడానికా?

బారిస్టర్ చదివిండంట… ఎందుకయ్యా బొంద పెట్టుకోవడానికా?

హైదరాబాదు: ‘లండన్ లో బారిస్టర్ చదివిండంట, ఎందుకయ్యా నీ చదువు బొందపెట్టుకోవడానికా’ని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మజ్లీస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకు పడ్డారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతోమాట్లాడారు. కేటీఆర్ ను ప్రస్తుతిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేసినందుకు పరోక్షంగా మండి పడ్డారు.‘అన్నీ అయిపోయాక ఓ లండన్ బారిస్టర్ ను తీసుకొచ్చిండు. ఆ లండన్ బారిస్టర్ నువ్వు వీరుడి, శూరుడివి. నువ్వు ఎగిరితే ఆకాశం, నువ్వు దుమికితే పాతాళం. నీ అంత మొనగాడు లేడు, నిన్ను చూసి అసూయపడుతున్నారని అంటుండు. ఆరున్నర అడుగులు పెరిగాయనకు సిగ్గుండాలి ఈ మాట అనడానికి! ఒళ్లు పెరిగితే సరిపోదు, కొంచెం బుర్రకూడా ఉండాలి ఈ ఆరున్నర అడుగులు పెరిగాయనకు. ట్విట్టర్ లో ఈయనకు మద్దతు పలకనీకి వచ్చిండు… లండన్ లో బారిస్టర్ చదివిండంట, ఎందుకయ్యా నీ చదువు బొందపెట్టుకోవడానికా.నీకు అంతగా చేయాలనుకుంటే గులాం గిరీ చేసుకో, నీ పార్టీని తాకట్టు పెట్టుకో ’అని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos