వేలానికి గంటా ఆస్తులు..

రుణాలు తీర్చడంలో విఫలం కావడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలం వేయడానికి ఇండియన్‌ బ్యాంకు అధికారులు సిద్ధమయ్యారు. త్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని..తిరిగి చెల్లించకపోవటంతో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. అయినా..ఇప్పటి వరకు రుణం తిరిగి చెల్లించలేదు.దీంతో..ఇచ్చిన గడువు ముగియటంతో డిసెంబర్ 20న గంటా ఆస్తులు వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. గంటా బ్యాంకు నుండి చెల్లించాల్సిన మొత్తం రుణ బకాయిలు దాదారూ.పు 209 కోట్లు గా చెబుతున్నారు. ఇందు కోసం మంత్రి బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్ల 35 లక్షల 61 వేలు గా బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. దీంతో..మిగిలిన మొత్తం కోసం గంటా వ్యక్తిగత ఆస్తులు వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది.అనేక సార్లు నోటీసులు ఇచ్చినా..పత్రికల ద్వారా వేలం ప్రకటనలు ఇచ్చినా ఇప్పటి వరకు తమకు చెల్లించాల్సిన బకాయిలు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో.. గంటా ఆస్తుల వేలం వేయాలని నిర్ణయించామన్నారు. అందు కోసం డిసెంబర్ 2న ముహూర్తంగా నిర్ణయించారు. అప్పటి లోగా గంటా తన బకాయిలు చెల్లించేందుకు ముందుకు వస్తే బ్యాంకు తమ నిర్ణయాన్ని ఉప సంహరించుకొనే అవకాశం ఉంది. అయితే రూ. 35 కోట్ల 35 లక్షల 61 వేల విలువైన ఆస్తులను తనఖా పెట్టుకొని బ్యాంకు రూ.209 కోట్ల రుణం ఎలా ఇచ్చిందనేది ఇప్పుడు చర్చకు కారణమైంది.

 

తాజా సమాచారం