బంగ్లా ఎంపీ మ‌ర్డ‌ర్‌ రేట్‌ రూ.5 కోట్లు

బంగ్లా ఎంపీ మ‌ర్డ‌ర్‌ రేట్‌ రూ.5 కోట్లు

కోల్కతా: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్.. కోల్కతాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంపీ అన్వరుల్ను చంపేందుకు అతని మిత్రుడే అయిదు కోట్లు ఇచ్చినట్లు పశ్చిమ బెంగాల్ సీఐడీ తెలిపింది. మే 13వ తేదీ నుంచి అన్వరుల్ మిస్సింగ్లో ఉన్నారు. ఈ కేసులో బెంగాల్ సీఐడీ దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని, భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని, ఆ ఎంపీని చంపేందుకు అతని పాత మిత్రుడే అయిదు కోట్లు ఇచ్చినట్లు ఓ పోలీసు ఆఫీసర్ తెలిపారు. ఆ ఎంపీ మిత్రుడు అమెరికా జాతీయుడని, అతనికి కోల్కతాలో కూడా ఫ్లాట్ ఉన్నట్లు ఆ ఆఫీసర్ చెప్పారు. అన్వరుల్ను హత్య చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది తెలిపారు. ఇప్పటి వరకు ఎంపీ అన్వరుల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించ లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos