అరటిలో మరిన్ని సుగుణాలు

అరటిలో మరిన్ని సుగుణాలు

అరటిపండులో చక్కెర… సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. 

►ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పిఎంఎస్‌) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతిరోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి.

►ఇందులో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos