కొడియాళం కాలువ సర్వేపనులను పరిశీలించిన మాజీ మంత్రి

కొడియాళం కాలువ సర్వేపనులను పరిశీలించిన మాజీ మంత్రి

హోసూరు : హోసూరు సమీపంలోని కొడియాళం ఎత్తిపోతల పథకం కాలువ సర్వేపనులను మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. కొడియాళం చెక్ డ్యాం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా 40 చెరువులను నింపేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని ప్రజా పనుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 20 మందికి పైగా ప్రజా పనుల శాఖ అధికారులు, ఇంజనీర్ల బృందం గత వారం రోజులుగా కాలువ సర్వే పనులను నిర్వహిస్తున్నారు. కాలువ సర్వే పనులలో భాగంగా మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి సర్వేపనులను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. తరువాత వడ్డేపల్లి, ఆలూరు, గనగొండపల్లి చెరువులను ప్రాజెక్ట్ రిపోర్టులో చేర్చి త్వరగా సర్వేపనులు పూర్తి చేయాలని బాలకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డితో పాటు హోసూరు యూనియన్ చైర్పర్సన్ శశి వెంకటస్వామి, వైస్ ఛైర్మన్ నారాయణస్వామి, జిల్లా కౌన్సిలర్ రవికుమార్ తదితరులు వున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos