మార్ఫెడ్ ఫొటో కేసులో నిందితురాలికి బెయిల్

మార్ఫెడ్ ఫొటో కేసులో నిందితురాలికి బెయిల్

న్యూఢిల్లీ: పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్ఫెడ్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసారనే ఆరోపణపై అరెస్టైన భాజపా యువమోర్చా నేత ప్రియాంక శర్మకు అత్యున్నత న్యాయస్థానం కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. మమతా బెనర్జీ మీమ్ పోస్టు చేసినందుకు క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం నిందితురాలు ప్రియాంక శర్మను ఆదేశించింది. ఎన్నికల సమయంతోబాటు, ఫిర్యాదు దారు రాజకీయ పక్షం కార్యకర్త అయినందున క్రిమినల్ చర్యల అంశాన్ని ప్రస్తుతానికి ప్రస్తావించడంలేదని పేర్కొంది. ఎన్నికల కారణంగా క్షమాపణ అర్థించడం తప్పనిసరి అని ధర్మాసనం హెచ్చరించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట ఒకరి వ్యక్తి గత మనోభావాలను దెబ్బతీయడాన్ని తాము సహించబోమని తేల్చి చెప్పింది. అనంతరం క్షమాపణ షరతను తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.ఈ విషయాన్ని ప్రియాంక శర్మ తరఫు న్యాయవాది ఎన్కే కౌల్కూ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos