నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు..

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు..

 వాన్‌పిక్‌ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డాడరనే ఆరోపణలపై నిమ్మగడ్డ ప్రసాద్‌పై నమోదైన కేసులకు సంబంధించి శనివారం ప్రసాద్‌కు బెల్‌గ్రేడ్‌ పోలీసులు బెయిల్‌ మంజూరు చేశారు.లాభాలు అర్జింజడానికి,నిధులు తరలించడానికి నష్టం కలిగించారనే ఆరోపణలతో యూఏఈ ఫెడరల్‌ కోర్టు నిమ్మగడ్డ ప్రసాద్‌పై యూఏఈ ఫెడరల్క్రిమినల్కోడ్లోని ఆర్టికల్‌ 5/5, 44, 225, 227, 228, 230, 399 కింద కేసులు నమోదు చేశారు.రస్‌అల్‌ ఖైమా(రాక్)దేశ అభ్యర్థన మేరకు 2016 సెప్టెంబర్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌పై అబుదాబి ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో సెర్బియాకు వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు బెల్‌గ్రేడ్‌లోని ఉన్నత న్యాయస్థానంలో హాజరు పరిచారు.నిర్బంధాన్ని అనుమతించిన కోర్టు.‘‘ నిర్బంధం జులై 27 ఉదయం 8.20 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. ప్రతి రెండు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఏడాది వరకు నిర్బంధాన్ని కొనసాగించడానికి వీలుంటుంది’’ అని కోర్టు పేర్కొంది.‘‘ఇంటర్పోల్జారీ చేసిన రెడ్కార్నర్నోటీసు, తమకు అప్పగించాలన్న రాక్అభ్యర్థన మా వద్ద ఉంది. సెర్బియాలో నిందితునికి నివాసం లేదు. రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యేలోగా పారిపోవడానికి, తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకోవచ్చు’’ అని కోర్టు అభిప్రాయపడింది.నిందితుడి వాదనలు వినకుండా తక్షణం అదుపులోకి తీసుకోవడానికి చట్టాలు అనుమతిస్తున్నాయని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా షరతులతో నిమ్మగడ్డను కోర్టు విడుదల చేసినట్టు సమాచారం. విడుదలైనప్పటికీ అక్కడున్న చట్ట ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆయన బెల్గ్రేడ్నగరం నుంచి బయటికి వెళ్లడానికి అవకాశం ఉండదు.దీంతో వాన్‌పిక్‌ వ్యవహారాకినికి సంబంధిచి శుక్రవారం విచారణకు హాజరు కాలేకపోయానంటూ సీబీఐకి న్యాయవాది ఉమామహేశ్వరరావు తరపున విన్నవించారు.వాన్‌పిక్‌ వ్యవాహరంలో మూడవ నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌కు 2018 జనవరి 8వ తేదీ నుంచి రెండేళ్ల పాటు విదేశాలకు సైతం వెళ్లొచ్చంటూ కోర్టు అనుమతించిన నేపథ్యంలో నిమ్మగడ్డ విదేశాలకు వెళ్లారని వాదన వినిపించారు.ఈ క్రమంలో సెర్బియాకు వెళ్లగా అప్పటికే రెడ్‌కార్నర్‌ నోటీసు ఉండడంతో సెర్బియా పోలీసులు నిర్బంధించారన్నారు. అప్పగించాలంటూ భారత దేశానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. ఆయన ఇండియాకు రాకుండా యూఏఈ నిరోధించే ప్రయత్నాలు చేసే పక్షంలో, ఇక్కడ ఉన్న కేసు విచారణ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. సీబీఐ చర్యలు తీసుకుని నిమ్మగడ్డను ఇక్కడ ప్రవేశపెడితే కేసు విచారణను కోర్టు యథావిధిగా కొనసాగించవచ్చనే ఉద్దేశంతో మెమో దాఖలు చేశాం’’ అని వివరించారు దశలో న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకోవాలి? ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలో చెప్పాలంటూ ప్రశ్నించారు. ‘‘ఉత్తర్వులు పొందడానికి తాము మెమో దాఖలు చేయలేదు. నిర్బంధంలో ఉన్నందున కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు రాలేకపోతున్నట్లు మాత్రమే సమాచారం ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos