ప్రయాణికులకు నరకం చూపిస్తున్న సంగం రోడ్డు

ప్రయాణికులకు నరకం చూపిస్తున్న సంగం రోడ్డు

సంగం:సంగం రోడ్డు ప్రయాణికులకు నరకం చూపిస్తోంది నెల్లూరు నుంచి సంగం మీదుగా ప్రయాణించే వారికి సంగం వస్తోందంటేనే హడలిపోతున్నారు ఇందుకు కారణం లేకపోలేదు కొంతకాలం కిందట నెల్లూరు నుంచి ఆత్మకూరు వరకు వేసిన సిమెంట్ హైవే తోనే ఈ చిక్కులన్నీ వచ్చాయి గతంలో హైవే సంగం పట్టణ మీదుగానే వెళ్ళేది అయితే సిమెంట్ హైవే వేసేటప్పుడు పట్టణ మీదుగా కాకుండా కొండ మీద నుంచి వేశారు ఆ సమయంలో ప్రయాణం రెండున్నర కిలోమీటర్లు కలిసి వచ్చిందని ప్రయాణికులు ఆనందించారు అయితే ఇది అనుకున్నట్టుగా జరగలేదు హైవే వేసిన దగ్గర్నుంచి ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు కొండల నడుమ చక్కటి సిమెంటు హైవే వేసినప్పటికీ బస్సులు మాత్రం సంగం మీదుగానే ప్రయాణించాల్సి వస్తోంది సంగం మీదుగా వెళ్లే రెండున్నర కిలోమీటర్ల దారి గుంటలు మిట్టల తో కూడి నరకాన్ని చూపిస్తోంది దీనికితోడు సంగం లోని చికెన్ షాపుల వారు రోడ్డు వెంబడి వ్యర్థ పదార్థాలను పార పారబొస్తూ ఉండడంతో అది కాస్త కుళ్ళి దుర్వాసనకు కడుపులో తిప్పుతోంది ఈ సంగతి పక్కన పెడితే ప్రయాణికులు ఎన్ని బాధలు పడితే మాకేంటి మా వ్యాపారాలు దెబ్బతింటాయని స్థానిక కూల్ డ్రింక్ షాప్ యజమానులు ధర్నాలు చేపట్టారు బస్సులు ఊళ్లోకి రావాల్సిందే నంటూ భీష్మించుకున్నారు ఇది ప్రయాణికులకు సంకటంగా మారింది ఎన్నికలకు ముందు జిల్లా మంత్రులు ఈ రోడ్డు గురించి కొంత పట్టించుకొని ప్రయత్నాలు చేశారు దీంతో ఈ రోడ్డుకు టెండర్లు కూడా అయ్యాయని వినిపిస్తోంది అయితే పనులు మాత్రం మొదలు కాలేదు ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయో తమ బాధలు ఎప్పుడూ తప్పుతాయని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos