రక్షించిన వారి వెంటే ఏనుగు పిల్ల పరుగులు

రక్షించిన వారి వెంటే ఏనుగు పిల్ల పరుగులు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో తాగునీటి ట్యాంకులో పడిన ఏనుగు పిల్లను కాపాడిన వారి వెంటే అది పరుగులు తీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని అయ్యుర్ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం వేసవిలో నీరు నింపేందుకు గాను సిమెంట్ తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ నీటితో వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఈ  తొట్టెలో ఆ ప్రాంతంలో లో వచ్చిన ఏనుగుల మంద నుండి ఓ పిల్ల ఏనుగు అదుపు తప్పి పడిపోయింది. కాపాడేందుకు తల్లి ప్రయత్నించి కాకపోవడంతో దానిని వదిలి వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏనుగు పిల్ల అరుపులు విన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు జెసిబి ద్వారా దానిని బయటికి తీశారు.  ట్యాంక్ నుండి బయట పడ్డ ఏనుగు పిల్ల, కాపాడిన వారి వెంటనే రోడ్ల వెంబడి పరుగులు తీసింది. ఏనుగు పిల్లను తరిమినా, అది స్థానికుల వెంబడి పరుగులు తీయడంతో అందరూ అవాక్కయ్యారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos