చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ధర్నాలు చేస్తున్న వారికి పోలీసుల హెచ్చరికలు

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ధర్నాలు చేస్తున్న వారికి పోలీసుల హెచ్చరికలు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కు నిరసనగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న వారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఎవరైనా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలో పబ్లిక్ న్యూసెన్స్, ధర్నాలు చేస్తున్న వారికి సైబరాబాద్ మాదాపూర్ డీసీపీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ధర్నాలకు ఎలాంటి పర్మిషన్ లేదని పబ్లిక్ న్యూసెన్స్కు, ట్రాఫిక్కు కారణం కావొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాన రోడ్లు, ఓఆర్ఆర్లపై ధర్నా చేయాలనుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే పలువురిని ముందస్తు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ధర్నాలు చేసి విధ్వంసం సృష్టిస్తే వారు పని చేసే కంపెనీలకు కూడా నోటీసులు వెళ్తాయన్నారు. సామాన్య ప్రజలకు వారి విధులకు, ట్రాఫిక్కు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos