చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈరోజు కూడా ఊరట లభించలేదు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. విచారణను ఈ నెల 19వ తేదీకి (మంగళవారం) వాయిదా వేసింది. కౌంటర్ వేయడానికి సీఐడీ న్యాయవాది సమయం కోరడంతో… 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపితే క్వాష్ పిటిషన్ పై ప్రభావం పడుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos