ఎస్పీ ప్రచారానికి యోగి ‘బాబా’

ఎస్పీ ప్రచారానికి యోగి ‘బాబా’

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ శనివారం అచ్చం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మాదిరే ఉన్న ఒక ‘‘బాబా’’ను పరిచయం చేశారు.కాషాయ వస్త్రాలు ధరించి, గుండు కొట్టించుకున్న వ్యక్తి తనతో పాటు నడిచి వస్తున్న ఫోటోలను అఖిలేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసారు. ముఖం మాత్రం కనిపించ లేదు. ‘మనం నకిలీ దేవుడ్ని తీసుకురాలేం. మేము ఒక ‘‘బాబా’’ని తీసుకొచ్చాం. గోరఖ్‌పూర్ నుంచి బయల్దేరిన ఆయన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వాన్ని గురించి నిజాలు చెప్పబోతున్నార’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos