రెండేళ్లైనా అదే క్రేజ్..

  • In Film
  • October 20, 2019
  • 133 Views
రెండేళ్లైనా అదే క్రేజ్..

రెండు భాగాలుగా విడుదలై తెలుగు చిత్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన బాహుబలికి ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆదివారం రోజు బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్నిలండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు బాహుబలిచిత్ర యూనిట్, అభిమానులు కొందరు ఇంగ్లాండ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క కనిపించడంతో అభిమానుల కేరింతలతో రాయల్ ఆల్బర్ట్ హాల్ మారుమోగింది. కేవలం హాల్ లోపల మాత్రమే కాదు రాయల్ ఆల్బర్ట్ హాల్ బయట వీధుల్లో కూడా అభిమానుల కోలాహలం కనిపించింది. ఇదిలా ఉండగా బాహుబలి చిత్రాన్ని జపాన్ లో కూడా విడుదల చేయగా అక్కడా భారీ విజయం సాధించింది. జపాన్ అభిమానులు బాహుబలి చిత్రానికి ఫిదా అయ్యారు. దీనితో రానా, ప్రభాస్, రాజమౌళిలకు జపాన్ లో విపరీతమైన క్రేజ్ నెలకొందిబాహుబలి చిత్ర ఆల్బర్ట్ హాల్ ప్రదర్శనకు కొందరు జపాన్ అభిమానులు కూడా హాజరయ్యారు. లండన్ వీధుల్లో రాజమౌళి కనిపించగానే జపాన్ అభిమానులు ఆయన్ని చుట్టేశారు. చాలా ఉత్సాహంతో జపాన్ ఫ్యాన్స్ రాజమౌళి మాట్లాడుతూ కనిపించారు. చిత్ర ప్రదర్శన జరుగుతున్నంతసేపు చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి నేతృత్వంలో నేపథ్య సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాహుబలి తారలు ప్రభాస్, రానా, అనుష్కలతోపాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పంచెకట్టులో రాజమౌళి బాహుబలి బృందంతో సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos