అయోధ్యలో నిషేధాజ్ఞలు

అయోధ్యలో నిషేధాజ్ఞలు

అయోధ్య:ఇక్కడి వివాదాస్పద రామాలయ- బాబ్రి మసీదు నిర్మాణాల గురించి దాఖలైన వ్యాజ్యంపై  అత్యున్నత న్యాయస్థానం సోమవారం నుంచి మళ్లీ విచారణ ప్రారంభించినందున ముందు జాగ్రత్త చర్యగా అయోధ్యలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞల్ని విధించారు. అతి సున్నితమైన ఈ కేసులో విచారణ చివరి దశకు చేరింది. తీర్పు వెలువడనుండడంతో డిసెంబరు 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు .దసరా సెలవుల తర్వాత సోమవారం – 38వ రోజు విచారణ జరుగుతోంది. . మధ్యవర్తిత్వం విఫలం కావటంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 6 నుంచి విచారణ చేపట్టారు. ఈ నెల 16న కక్షిదార్ల వాదనలు ముగించాలని న్యాయ స్థానం నిర్ణయించింది. అతి సున్నితమైన ఈ కేసులో విచారణ చివరి దశకు చేరడం, తీర్పు వెలువడనుండడంతో ఆంక్షలు విధించామని, డిసెంబరు 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos