12,500 ఆయుష్ కేంద్రాల ఏర్పాటు

12,500 ఆయుష్ కేంద్రాల ఏర్పాటు

న్యూ ఢిల్లీ:దేశ వ్యాప్తంగా మొత్తం 12,500 ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన యోగ పురస్కారాల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. శుక్రవారమే 10 ఆయుష్ కేంద్రాల్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఏడాది 4000 కేంద్రాలు ఏర్పాటవుతాయని వివరించారు. ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే మొబిలిటీ కార్డు తరహాలో ఆయుష్ గ్రిడ్ల ఏర్పాటు అనివార్య మ న్నారు. దేశంలో 1.5 లక్షల ఆరోగ్య, సంరక్షణా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయ వైద్య రంగమైన ఆయుష్కి సాంకేతికతను జోడించి కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos