205 ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ నుంచి తొలగింపు

205 ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ నుంచి తొలగింపు

నెల్లూరు:ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నియమ, నిబంధనలు క్రమ బద్ధంగా పాటించని ఆస్పత్రులను ప్యానల్ నుంచి తొలగించామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే శుక్రవారం నెల్లూరు సభ్యులు ఆదాల ప్రభాకర రెడ్డి అడిగిన ప్రశ్నకు రాత పూర్వకంగా బదులిచ్చారు.నియమ నిబంధనలు పాటించని 205 ఆసుపత్రులను ఈ ఏడాది మార్చి 16కి తొలగించామన్నారు. ఆయుష్మాన్ భారత్ పట్టిక నుంచి 171 ఆస్పత్రుల్ని తొలగించటానికి కారణాలేమిటని ప్రభాకర రెడ్డి ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లోపించకుండా క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహిస్తున్నామని, వైద్య వ్యర్థాల ధ్వంసాన్ని తప్పనిసరి చేసినట్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos