హత్యాచార నిందితులెవరో రోజాకు తెలుసు..

హత్యాచార నిందితులెవరో రోజాకు తెలుసు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి వార్తల్లోకెక్కింది.ఆయేషా హత్యాచార కేసును 12 ఏళ్ల అనంతరం సీబీఐ విచారణకు అప్పగించడంతో ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం చేయనున్నారు. అప్పట్లో కోర్టుకు అందించిన ఆధారాల్లో పరీక్షించింది అసలు ఆయేషా డీఎన్‌ఏనేనా అనే అనుమానం సీబీఐ బృందానికి రావటంతో ఆమె డీఎన్‌ఏను నిర్ధారించుకునేందుకు ఆమె తల్లిదండ్రులు షంషాద్‌ బేగం, ఇక్బాల్‌ బాషాల డీఎన్‌ఏలను కూడా సేకరించారు. వీరితోపాటు హాస్టల్‌ వార్డెన్‌ పద్మ, ఆమె భర్త శివరామకృష్ణ, నిర్డోషిగా విడుదలైన సత్యంబాబు డీఎన్‌ఏలను కూడా సేకరించారు. నాడు కోర్టుకు చూపిన ఆయేషా డీఎన్‌ఏకు, తల్లిదండ్రుల డీఎన్‌ఏకు పోలిక లేకపోవటం వల్లో, మరే కారణమోకానీ, ఆయేషా మృతదేహాన్ని మళ్లీ తవ్వితీసి రీపోస్ట్‌మార్టం చేయించాలని సీబీఐ అధికారులు కోరారు.ఇదిలా ఉండగా ఆయేషా హత్యాచార ఘటనకు సంబంధించి ఆయేషా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు.తన కూతురిని చంపిందెవరో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుసని అన్నారు. తన కూతురు హత్యకు గురైన తర్వాత రోజా ఎంతో హడావుడి చేశారనినేరస్తులెవరో ఆమెకు తెలుసని అన్నారు. వారి గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలని శంషాద్ బేగం అన్నారు. మధ్యతరగతి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు. నేరస్తుల గురించి గతంలో తాను ఒకసారి మాట్లాడితే కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారనితమ వద్ద కోటి పైసలు కూడా లేవనిఎలాంటి దావా అయినా వేసుకోవచ్చని అన్నారు. విచారణలో నిజాలు వెలుగు చూస్తేఎవరు కోటి రూపాయలు చెల్లించాలో, ఎవరు శిక్ష అనుభవించాలో తెలుస్తుందని చెప్పారు.న్యాయం కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నానని శంషాద్ బేగం తెలిపారు. మన దేశంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందని చెప్పారు. 21 రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ కేసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయేషా చట్టాన్ని తీసుకురావాలని అన్నారు.కాగా ఈ దారుణం వెనుక అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనుమడు సతీష్‌, అతడి మిత్రులు ఉన్నారని షంషాద్‌ బేగం ఆరోపించారు. హాస్టల్‌ వార్డెన్‌, ఆయేషా ఉండే అంతస్తులో ఉంటున్న విద్యార్థినులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కోనేరు సతీష్‌, అబ్బూరి గణేష్‌, సురేష్‌, చింతా పవన్‌, రాజేష్‌, కవిత, సౌమ్య, ప్రీతి, హాస్టల్‌ వార్డెన్‌ పద్మ, ఆమె భర్త శివరామకృష్ణను విచారించాలని ఆయేషా తల్లి పలుమార్లు పట్టుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos