డెంగ్యూపై విద్యార్థులకు అవగాహన

డెంగ్యూపై విద్యార్థులకు అవగాహన

హొసూరు : డెంకణీకోట తాలూకా కెలమంగలం సమితి కాడు లక్కసంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు డెంగ్యూపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు డెంగ్యూ ఎలా వ్యాప్తి చెందుతుందో…విద్యార్థులకు వివరించారు. పాఠశాల, దేవాలయం, రోడ్లపై ఉండే ప్లాస్టిక్‌ కవర్లు, కొబ్బరి చిప్పలు, టైర్లలో వర్షపు నీరు నిల్వ ఉండి, డెంగ్యూ వ్యాప్తికి కారణమవుతాయని తెలిపారు. కనుక అలాంటి వాటిని తొలగించి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలుతీసుకోవాలని సూచించారు. ఇళ్లలో తల్లిదండ్రులకు కూడా దీనిపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలియజెప్పారు. వర్షా కాలంలో డెంగ్యూ విజృంభిస్తుందని, కనుక పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దానికి అవకాశం కల్పించకుండా చూడాలని ఉపాధ్యాయులు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos