రెండేళ్లకో అవతార్‌ రెడీ..

  • In Film
  • May 8, 2019
  • 162 Views
రెండేళ్లకో అవతార్‌ రెడీ..

కళ్లు చెదిరే విజువల్స్తో కొద్ది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే.విడుదలైన ఐదు రోజుల్లోనే వసూళ్లలో ఇప్పటి వరకు టాప్ఛైర్లో ఉన్న దశాబ్ద కాలం క్రితం విడుదలైన అవతార్ చిత్రం సాధించిన 2.78 బిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించి కొత్త రికార్డును సెట్ చేసింది.అవెంజర్స్ సంచలనాలు గురించి పక్కన పెడితే దాదాపు పదేళ్ల క్రితం రిలీజైంది అవతార్ (2009). బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఇప్పటికీ ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంది.ఇప్పుడు ` అవతార్ సీక్వెల్స్ గురించిన ఆసక్తికర సమాచారం అందింది. `ఎండ్ గేమ్` రికార్డులకు చెక్ పెట్టే సత్తా ఉన్న ఫ్రాంఛైజీ అవతార్ నుంచి వరుసగా బుల్లెట్లు దూసుకురానున్నాయ్. ఈ ఫ్రాంఛైజీ నుంచి వరుసగా నాలుగు సీక్వెల్స్ రెండేళ్ల కోసారి ట్రీట్ ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు రానున్నాయి.అవతార్ను నిర్మించిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ సంస్థను కొనుగోలు చేసిన వాల్ట్ డిస్నీ సంస్థ అవతార్ ఫ్రాంచైజ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇప్పటికే అవతార్ 2 పనులు ప్రారంభించిన డిస్నీ సంస్థ 2020 డిశెంబర్ 17వ తేదీన అవతార్ 2ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.దీంతో పాటు 22 డిసెంబర్ 2023లో అవతార్ 3, 12 డిసెంబర్ 2025న అవతార్ 4.. 17 డిసెంబర్ 2027లో అవతార్ 5 రిలీజవుతాయని వాల్డ్ డిస్నీ సంస్థ ప్రకటించింది. టైటానిక్ ఫేం జేమ్స్ కామెరూన్ ఈ ఫ్రాంఛైజీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పండోరా గ్రహంపై జీవించే గిరిజన జాతి (అవతార్) మనుగడకు భూగ్రహం వాసుల వల్ల తలెత్తిన ప్రమాదమేంటి? ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏం చేశారు? అన్నది సీక్వెల్ సినిమాల కొనసాగింపు కథాంశం అని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos