రివర్స్‌ గేర్‌లో వాహనాల అమ్మకాలు

రివర్స్‌ గేర్‌లో వాహనాల అమ్మకాలు

న్యూ ఢిల్లీ: మోటారు వాహనాల అమ్మకాలు వరుసగా 11వ నెల్లోనూ క్షీణించాయి. గత నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 23.69 శాతం తగ్గాయి. కేవలం 2,23,317 వాహనాలే అమ్మడయ్యాయి. నిరుడు ఇదే వ్యవధిలో 2,92,660 వాహనాల్ని విక్రయించారని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్) శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. దేశీయ కార్లు నిరుటి సెప్టెంబరులో 1,97,124 అమ్ముడు కాగా గత నెల్లో 1,31,281 మాత్రమే అమ్మడయ్యాయి. 10,43,624 మోటార్ సైకిళ్లు విక్రయమయ్యాయి. నిరుటితో పోలిస్తే వీటి అమ్మకాలు 22.09శాతం తగ్గాయి. వాణిజ్య వానాలదీ ఇదే పరిస్థితి. గత నెల్లో అమ్ముడైన అన్ని రకాల వాహనాల సంఖ్య త 20,04,932. నిరుడు ఇదే వ్యవధి కంటే 2.8 లక్షలు తక్కు వ. కొనుగోళ్లు పెంచుకునేందుకు ఉత్పత్తి దార్లు అనేక ప్రయత్నాలు చేస్తున్నా కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగడంతో ఆటో రంగం కోలుకో లేకపోతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos