ఆడీ నుంచి ఎలక్ట్రిక్‌ కారు

  • In Money
  • June 29, 2019
  • 151 Views
ఆడీ నుంచి ఎలక్ట్రిక్‌ కారు

ఢిల్లీ : ఆటోమొబైల్‌ దిగ్గజం ఆడీ దేశంలో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ కారును విడుదల చేయాలనుకుంటోంది. వచ్చే నెల 12న దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. దీనికి ముందే ఇ-ట్రాన్‌ పేరిట కారును మార్కెట్లోకి తీసుకు రానుంది. దీనికి సంబంధించి కారు ప్రివ్యూను కూడా నిర్వహించింది. ఇ-ట్రాన్‌ కారులో రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు ఉంటాయి. ఒకటి 125 కిలోవాట్లు, మరొకటి 140 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒకసారి ఛార్జింగ్‌తో 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. సాధారణ ఛార్జింగ్‌ పాయింట్‌లో సుమారు ఎనిమిది గంటల పాటు ఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ ఛార్జర్‌ అయితే కేవలం 40 నిముషాల్లోనే బ్యాటరీ నిండిపోతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.1.5 కోట్లపైనే ఉండవచ్చని అంచనా.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos