నిషేధం వేటే సరైనది…గౌతమ్

నిషేధం వేటే సరైనది…గౌతమ్

దిల్లీ: మాజీ క్రికెటర్‌, దిల్లీ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అమిత్‌ భండారిపై జరిగిన దాడిని గౌతమ్‌ గంభీర్‌ ఖండించాడు. దాడిచేసిన వారిపై తీవ్ర విమర్శలు చేశాడు. దోషిపై కనికరం చూపించొద్దన్నాడు. అతడిని జీవితాంతం క్రికెట్‌కు దూరంగా ఉంచాలని డిమాండ్‌ చేశాడు.

ఎంపిక చేయనందుకు దాడి

దిల్లీ: భారత మాజీ క్రికెటర్‌, దిల్లీ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అమిత్‌ భండారి దాడికి గురయ్యాడు. తిరస్కరణకు గురైన ఓ అండర్‌-23 ఆటగాడి నేతృత్వంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లు, హాకీ స్టిక్కులతో భండారిపై దాడికి పాల్పడ్డారు. తల, చెవులకు గాయాలైన భండారిని సహచర సెలక్టర్‌ సుఖ్విందర్‌ సింగ్‌ ఆస్పత్రిలో చేర్చాడు. అండర్‌-23 జట్టులో స్థానం ఆశించి భంగపడ్డ అనూజ్‌ ఆహుజా  అనే ఆటగాడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos