అతనికెంత ధైర్యం.. ఆమె దుస్తులపై చెయ్యి వేస్తాడా?

అతనికెంత ధైర్యం.. ఆమె దుస్తులపై చెయ్యి వేస్తాడా?

ముంబై: ‘‘మహిళా నాయకురాలి దుస్తుల మీద చేయి వేస్తాడా! ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను బలంగా విశ్వసించే యోగి ఆదిత్యనాథ్ జీ సదరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అంటూ మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు చిత్రా వాగ్ ట్విట్ట్టర్ లో డిమాండు చేసారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉత్తరప్రదేశ్ పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు చిత్ర పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భాజపాలో చేరినప్పటికీ ఆమె తన సంస్కారం మరచిపోలేదని, సాటి మహిళకు మద్దతుగా నిలిచారంటూ మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యజిత్ తాంబే ప్రశంసించారు. హథ్రాస్ అత్యాచారం, హత్య ఘటన లో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూపీకి వెళ్లినపుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ అధికారి ప్రియాంక గాంధీ దుస్తులు పట్టుకుని ఆమెను ఆపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos