ఉన్నావో నిందితుడికి భాజపా నేత సానుభూతి

ఉన్నావో నిందితుడికి  భాజపా నేత సానుభూతి

లక్నో: ఉన్నావో అత్యాచారం కేసులో ప్రదాన నిందితుడు కుల్దీప్సింగ్ను ఉత్తర ప్రదేశ్ భాజపా నాయకుడు ఆశిష్ సింగ్ అషు వెనకుసుకు రావటం వివాదాస్పదమైంది.ఉన్నావోలో శనివారం జరిగిన కార్యక్రమంలో కుల్దీప్ సింగ్ పట్ల ఆశిష్ సింగ్ ఎంతో కరుణ చూపారు. ‘మన సోదరుడు కుల్దీప్ సింగ్ నేడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం కుల్దీప్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మనం అన్నకు తోడుగా ఉండాలి. త్వరలోనే కుల్దీప్ ఈ కష్టాల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నా కుల్దీప్ క్షేమం గురించి ఆలోచించాలి’అని బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఆశీష్ వ్యాఖ్యల్ని ప్రతి పక్షాలు, మహిళా సంఘాలు ఖండించాయి. ‘ఆడపిల్లకు అన్యాయం చేసి చంపడానికి చూసిన వాడిని వెనకేసుకు వస్తున్నారు. మీలాంటి నాయకుల ఉండటం మా ఖర్మ’ అంటూ జనాలు కూడా ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos