ముస్లింలు భయపడాల్సిన పని లేదు

ముస్లింలు భయపడాల్సిన పని  లేదు

హైదరాబాదు: ‘భాజపా మరోసారి అధికారంలోకి వచ్చిందని ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు. దేశంలోని ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింద’ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం సాయంత్రం ఇక్కడ అన్నారు. ‘ప్రధాని మోదీ ఆలయాలకు వెళితే మనం మసీదులకు పోదాం. మోదీ గుహల్లో కూర్చుంటే మేము మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటామని గర్వంగా చెబుదాం. భారత్లో సజీవమైన ఒక గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉంది. మన దేశంలో 300లకు పైగా లోక్సభ స్థానాల్లో గెలవటం గొప్ప విషయమేమీ కాదు. అన్ని స్థానాల్ని భాజపా మన హక్కులను కాలరాయజాలద’ని పేర్కొన్నారు. ‘మనం మన మత విధానాల్ని ఆచరించే స్వేచ్ఛను భారతీయ చట్టాలు, రాజ్యాంగం ఇచ్చాయి. భారత్ లో మనం బాడుగ దార్లం కాము. అందరితో సమానంగా, గౌరవంగా బతికే హక్కు మనకు ఉంది. భారత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మనమంతా మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేద్దాం. మన దేశం గొప్పగా పరిఢవిల్లేలా చేద్దామని’ ముస్లింలకు పిలుపు నిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos