గరుడ సేవ రోజు ప్రత్యక్షమైన గరుడ పక్షి..

గరుడ సేవ రోజు ప్రత్యక్షమైన గరుడ పక్షి..

తిరుమలలో గరుడసేవ రోజున గరుడపక్షి తప్పనిసరిగా కనిపిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉన్నవిషయం తెలిసిందే.శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహన సేవ నేపథ్యంలో తిరుపతిలో గరుడ పక్షి ప్రత్యక్షమైంది. జిల్లా కోర్టు ఆవరణలో గరుడ పక్షి కనిపించింది. ఎగరలేని స్థితిలో ఉన్న అరుదైన పక్షిని చూసి లాయర్లు అందరూ వింతగా చూశారు.అరుదైన పక్షి అపస్మారక స్థితిలో కనపడటం వెంటనే తిరుపతి అటవీ సిబ్బందికి సమాచారం చేరవేశారు. అటవీ శాఖకు చెందిన శంకర్ వచ్చి గరుడ పక్షిని ఎస్వీ జూకు తరలించారు. వైద్యం అందించి కోలుకున్న తరువాత శేషాచలంలో వదులుతామని ఫారెస్టు అధికారి శంకర్ తెలిపారు. పురాణాలలో చెప్పినట్లు తిరుమలలో గరుడ సేవ రోజు గరుడ పక్షి కనపడటం శ్రీవారి మహిమేనని భక్తులు అంటున్నారు.గరుడసేవ జరిగే సమయానికి ఆకాశంలో విహరించే గద్దలు మిగతా ఏ సేవ రోజూ కూడా కనిపించకపోవడం విశేషం. అందుకే గరుడోత్సవానికి అంతటి ప్రాశస్త్యం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos