నాటుసారా విక్రేత అరెస్ట్

నాటుసారా విక్రేత అరెస్ట్

హొసూరు : హొసూరు సమీపంలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న నాటు సారాను స్వాధీనపరుచుకున్నారు. కృష్ణగిరి జిల్లా రాయ కోట సమీపంలోని పట్టి పారి గ్రామానికి చెందిన పెరుమాళ్ గత కొద్ది రోజులుగా నాటు సారా విక్రయిస్తున్నాడు. రహస్య సమాచారం మేరకు రాయకోట పోలీసులు పట్టిపారి గ్రామం వద్ద నిఘా పెట్టారు. పెరుమాళ్ నాటుసారా విక్రయిస్తూ ఉండగా అరెస్టు చేసి,  అతని వద్దనున్న నాటు సారా స్వాధీనపరచుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos