హొసూరు వద్ద నాటు సారా ధ్వంసం

హొసూరు వద్ద నాటు సారా ధ్వంసం

హొసూరు : తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగాహొసూరు ప్రాంతంలో నాటు సారా తయారీ జోరుగా సాగుతున్నది. ఒకపక్క మద్యం దుకాణాలు మూతపడడంతో మద్యం ప్రియులు నాటుసారా వైపు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న నాటు సారాను తయారు చేసి విక్రయిస్తున్నారు. నాటు సారాను అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా పోరాడుతున్నా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. వారం రోజులుగా హొసూరు ప్రాంతంలో సుమారు 20 మందికి పైగా నాటుసారా విక్రేతలను అరెస్టు చేశారు. శుక్రవారం హొసూరు సమీపంలోని గోపసంద్రం వద్ద ఓ కాలనీలో నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో డి.ఎస్.పి సంగు, పో లీసులు దాడి చేసి  ఇద్దరిని అరెస్టు చేశారు.  50 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos