యూపీకి భారీగా తరలుతున్న బలగాలు..

యూపీకి భారీగా తరలుతున్న బలగాలు..

దశాబ్దాలుగా అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదంపై జరుగుతున్న విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏరోజైనా తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోంది.అందులో భాగంగా యూపీకి భారీ ఎత్తున పారా మిలిటరీ బలగాలను పంపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 15 కంపెనీల అదనపు పారా మిలిటరీ దళాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.ఈ నెల 11న ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలకు చెందిన సాయుధ బలగాలను యూపీకి పంపించనున్నారు. ఈ బలగాలను సున్నిత ప్రాంతాలైన వారణాసి, కాన్పూర్, ఆజంఘడ్, అలీఘర్, లక్నో తదితర 12 ప్రాంతాల్లో మోహరించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos