ధోనీకి శిక్షణ ఇవ్వడానికి ఆర్మీ చీఫ్ ఆమోదం?

ధోనీకి శిక్షణ ఇవ్వడానికి ఆర్మీ చీఫ్ ఆమోదం?

 ఐసీసీ ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచి నిష్కృమించిన అనంతరం త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌ నుంచి భారతజట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే.టెరిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ రెండు నెలల పాటు రెజిమెంట్‌లో పని చేయడానికి నిర్ణయించుకొని వెస్టిండీస్‌ పర్యటన నుంచి తప్పుకున్నాడు.ఈ క్రమంలో రెజిమెంట్‌లో శిక్షణ పొందడానికి ధోనీ చేసుకున్న దరఖాస్తుకు భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.దీంతో ధోనీ ప్యారాచూట్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకోనున్నాడు. కశ్మీర్‌ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఉండే అవకాశం ఉంది. అయితే ధోనీ సైనిక చర్యల్లో భాగం కాలేడని తెలిసింది. ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. ధోనీ వెస్టిండీస్‌ టూర్‌ నుండి స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ కీపర్‌గా ఎంపిక చేశారు. వెస్టిండీస్‌ టూర్‌లోని మూడు ఫార్మాట్లలోనూ పంత్ ఆడనున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos