మరణంలోనూ వీడని స్నేహం

మరణంలోనూ వీడని  స్నేహం

అరియలూరు: కుల మతాల పేరిట గొడవలు పడే వారిని చూస్తూంటాం. అయితే మతాలు వేరైనా అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పదని నిరూపించారు ఇక్కడి ఇద్దరు వ్యక్తులు. నలభై ఏళ్లుగా స్నేహం చేసిన వారు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని చాటారు. ఇది కాకతాళీయమైనా అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరి యలూరు తాలూకా జయకొండంలో నివసించే మహాలింగం(70), జైలబుద్దీన్(66) చిరకాల మిత్రులు. అయితే అనుకోని విధంగా వారిద్దరూ అర గంట వ్యవధిలోనే మరణించడం రెండు కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపింది. గ్రామంలోని విరుదాచలం రోడ్డులోని మారియమ్మన్ ఆలయంలో మహాలింగం పూజారి. ఆలయానికి సమీ పంలోనే టీ స్టాల్ కూడా నడిపేవాడు. జైలబుద్దీన్ రైస్ మిల్లు యజమాని. మహాలింగం ఇంటికి ఎదురుగా నివసిస్తున్నాడు.మహాలింగం ఇంట్లో జరిగే శుభకార్యాలు, పండు గలకు జైలబుద్దీన్ కుటుంబంతో సహా హాజరయ్యేవాడు. అలానే జైలబుద్దీన్ ఇంట్లో నిర్వహించే ముస్లిం పండుగలకు మహాలింగం తప్పక వెళ్లేవాడు. రక్తపోటుతో బాధపడు తోన్న మహాలింగం మంగళవారం ఆసుపత్రిలో చేరాడు. అయితే అంతకుముందే అనారోగ్యం కారణంగా అదే ఆసుపత్రిలో జైలబుద్దీన్ చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరినీ ఒకే వార్డులో ఉంచారు వైద్యులు. ఏప్రిల్ 6 సాయంత్రం 4 గంటల సమయంలో జైలబుద్దీన్ ఛాతీ నొప్పితో కన్నుమూశాడు. స్నేహితుని మరణ వార్త విన్న మహాలింగం తీవ్రంగా బాధపడి, కన్నీళ్లు పెట్టుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 30 నిమిషాలకే ఆయన కూడా ప్రాణాలు విడిచాడని చెప్పారు. 40 ఏళ్ల వీరి స్నేహానికి గుర్తుగా ఇరు కుటుంబాలు ఉమ్మడి బ్యానర్ను ఏర్పాటు చేశాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos