కరోనాను ఎదిరించే మిఠాయి

కరోనాను ఎదిరించే మిఠాయి

కోల్కతా : కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచే మిఠాయిల్ని విపణిలోకి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సుందర్భన్ అడవుల నుంచి సేకరించిన తేనె, స్వచ్ఛమైన ఆవు పాలు, తులసీ రసంతో తయారుచేసిన ఈ మిఠాయికి ‘ఆరోగ్య సందేశ్’గా నామకరణం చేశారు. ‘పూర్తి సహజమైన పద్ధతిలో దీన్ని తయారు చేసారు. ఇందులో ఎలాంటి కృత్రిమ పదార్థాలు, రంగులు కలపలేద’ని అధికారి ఒకరు జాతీయ మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇది కరోనాకు విరుగుడు కాదు. కేవలం రోగ నిరోదక శక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య సందేశ్కు ప్రభుత్వ అనుమతి కూడా లభించింది. అతి త్వరలోనే సామాన్యులకు ఇది అందుబాటు ధరల్లో లభించనుంద’ని సుందర్బన్స్ వ్యవహారాల మంత్రి మంతురాం పఖిరా తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ప్రఖ్యాత మిఠాయి తయారీ సంస్థ రోగ నిరోధక సందేశ్ పేరుతో ఈ మిఠాయిని తయారుచేసింది. పసుపు, తులసి, కుంకుమ, యాలకులు, తేనే వంటి మూలికలతో దీన్ని తయారు చేసారు. వివిధ పరిశోధనల అనంతరం దీనికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ మిఠాయిలో ఉన్నట్లు శాస్ర్తీయంగా తేలింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos