అమితాబ్‌ ఇంటి ఎదుట పర్యావరణ అభిమానుల ధర్ణా

అమితాబ్‌ ఇంటి ఎదుట పర్యావరణ అభిమానుల ధర్ణా

ముంబై: ముంబై మెట్రో రైలు నిర్మాణానికి ఆరే వనాన్ని ప్రభుత్వం నరకటాన్ని సమర్థించినందుకు నిరసనగా నటుడు అమితాబ్ ఇంటి ఎదుట బుధవారం పర్యావరణ అభిమానలు ధర్ణా చేసారు. అడవులను కాపాడండి, ఆరే అడవిని కాపాడండి అని నినదించారు. ‘అమితాబ్జీ తోటల నుంచి అడవులు తయారు కావు’ అని నినాదాలు రాసిన అట్టల్ని ప్రదర్శించారు. ముంబయి మెట్రో రైలు కార్ల షెడ్డు కోసం ఆరే కాలనీ, అటవీ ప్రాంతంలోని వృక్షాలని ప్రభుత్వం నరకనుంది. ఇందుకు ముంబై మహానగర పాలికే కూడా అనుమతించింది. అయినా చెట్లు నరక రాదని పర్యావరణ అభిమానలు ప్రేమికులు ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉండగా అమితాబ్ … ‘నా మిత్రుడు ఒకరు ఆస్పత్రి అత్యవసర పని నిమిత్తం తన కారు వదిలి మెట్రోలో ప్రయా ణించాడు. మెట్రో ద్వారా తక్కువ సమయంలో తన పని పూర్తి చేసుకుని మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. వీలై నన్ని వృక్షాలను పెంచడమే కాలుష్యానికి పరిష్కారం. నేను నా తోటలో పెంచుతున్నాను. మీరు కూడా చేయండ’ని ట్విట్ చేసారు. ఆయన ట్వీ ట్ను ముంబయి మెట్రో అధికారి అశ్విని బిడే కూడా సమర్థించారు.రు. అయితే దీనిపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొందరు ఆయన ఇంటి ముందు అడవులను కాపాడండి, ఆరే అడవిని కాపాడండి అంటూ నిరసనకు దిగారు. ‘అమితాబ్జీ తోటల నుంచి అడవులు తయారు కావు’ అని ప్లకార్డులను ప్రదర్శించారు.

తాజా సమాచారం