అరబిందో కార్మికుల సమ్మె శంఖారావం

అరబిందో కార్మికుల సమ్మె శంఖారావం

శ్రీకాకుళం : అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్ 15 న సమ్మె చేపడతామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సిం గరావు గురువారం యాజమాన్యాన్ని హెచ్చరించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో పైడి భీమవరంలో గురువారం కార్మికులు సమ్మె శంఖారావం పాదయాత్ర చేపట్టారు. అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని నర్సింగారావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్నసిబ్బంది సేవల్ని క్రమ బద్దం చేయ కుండా కాంట్రాక్టు కార్మికుల పేరిట తీవ్ర శ్రమ దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. యాజమాన్యం సంవత్సరానికి 1800 కోట్లు రూపాయలు లాభాలు అర్జిస్తోంది. ఇందులో కార్మికులు వాటా అడగడం లేదని, తమ శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రమే కోరుతున్నారని చెప్పారు. అన్నారు. వేత నాలు  పెంచకుండా, సమస్యలను పరిష్కరించకుండా పారిశ్రామిక అశాంతికి యాజమాన్యమే కారణమవుతుందని కుండబద్ధలు కొట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos