సర్వత్రా ఉత్కంఠ..రాజ్ భవన్ వైపే అందరి చూపు

సర్వత్రా ఉత్కంఠ..రాజ్ భవన్ వైపే అందరి చూపు

విజయవాడ: రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ.రాజ్ భవన్ వైపే అందరి చూపు. గవర్నర్ బిశ్వభూషన్ హరిందన్ నిర్ణయాలపై నెలకొన్న ఉత్కంఠ. పాలనా వికేంద్రీకరణ, సి ఆర్ ఢి.ఎ. చట్టం రద్దు అంశాలపై ఒకటి రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న గవర్నర్. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అంశాల్ని ప్రస్తుతం పరిశీలిస్తు న్నారు. మూడు రాజధానుల అంశంపైనే ఎక్కువ ఫోకస్. న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజభవన్ వర్గాలు తెలిపాయి. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్మియామాకంపై కూడా సర్వత్రా ఆసక్తి. సోమవారం ఆయన గవర్నర్ తో భేటీ తర్వాత రాజ్యంగ పరిధిలో ఉన్న అంశాలను మరోసారి గవర్నర్ పరిశీలించారు. నిమ్మగడ్డ నియామకంపై మంగళవారం తుది నిర్ణయాన్నితీసుకునే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos