రామయ్య పట్నం లో మేజర్ పోర్టు స్థాపించండి

రామయ్య పట్నం లో  మేజర్ పోర్టు స్థాపించండి

నెల్లూరు: ప్రకాశం జిల్లాలోని రామయపట్నంలో మేజర్ ఓడరేవు స్థాపనకు త్వరగా ఆమోదాన్ని తెలిపి నిర్మాణ పనుల్ని ప్రారంభించాలని వైకాపా సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. శూన్యవేళలో ఆయన మాట్లాడారు. దుగరాజ పట్నంలో రేవు ఏర్పాటునకు గతంలో అంగీకారం లభించినా అది షార్ కేంద్రం, పులికాట్ సరస్సు దగ్గరగా ఉండడం వల్ల అది రేవు ఏర్పాటు తగిన స్థలం కాదనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. దరిమిలా మేజర్ పోర్టును రామాయపట్నంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని రామాయ పట్నంలో పోర్టు ఏర్పాటుకు సూచించిందని తెలిపారు. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. ఈ ఖర్చు దాదాపు రూ. 25 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేసిందని అన్నారు. రామాయపట్నం పోర్టులో, కాకినాడలో ఏర్పాటు చేయదలచిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను తరలిస్తే పోర్టుకు మరింత ఉపయోగంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos