క్షమాపణ చెప్పిన రాహుల్‌ గాంధీ

క్షమాపణ చెప్పిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ :రాఫెల్ యుధ్ద విమానాల కొనుగోలు ఒప్పంద వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీని కాపలాదారే దొంగ అని అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించినట్లు గతంలో తాను పేర్కొన్నందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన న్యాయస్థానం ధిక్కార వ్యాజ్యాన్ని కొట్టి వేయాలని కోరారు. దీని గురించి శుక్రవారం విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘గౌరవ న్యాయ స్ధానానికి తాను అన్యాపదేశంగా తన ఉద్దేశాన్ని ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని’ ప్రమాణ పత్రంలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాఫెల్‌ పోరాట విమానాల కొనుగోలు ఒప్పంద వివాదంలో కాపలా దారే దొంగ అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానం ధిక్కర ణే అవుతందని భాజపా రాజ్యసభ సభ్యులు మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్ధానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos