నిన్న గాంధీ నిందన-నేడు మన్నింపు

నిన్న గాంధీ నిందన-నేడు మన్నింపు

బెంగళూరు: జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకమని చేసిన వ్యాఖ్యలకు భాజపా లోక్సభ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే క్షమాపణలు సోమవారం చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల భాజపా అధిష్ఠానం ఆగ్రహిం చినందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ‘గాంధీజీని మహాత్ముడు అని ప్రజలు పిలుస్తుంటే నా రక్తం మరిగి పోతోంది’అని నగరంలో ఆది వారం జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ‘భారత స్వాతంత్ర్య సంగ్రామం బ్రిటిష్ వారి మద్దతు తోనే జరిగింది. నాటి నాయకులు ఒక్క సారి కూడా పోలీసులతో దెబ్బలు తిన లేదు. స్వాతంత్ర్య పోరాటం నాటకం. అది నిజమైన పోరాటం కాదు. సర్దు బాటు ఉద్యమం. సత్యా గ్రహం వల్ల బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఇవ్వ లేదు. విసుగు పుట్టినందునే భారత్ను వదిలి వెళ్లిపోయార’ని వ్యాఖ్యా నించారు. 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos