బాబు క్షమాపణకు జగన్‌ డిమాండు

బాబు క్షమాపణకు జగన్‌ డిమాండు

అమరావతి: ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, తప్పు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ డిమాండు చేసారు. నూతన సభాపతి సీతారాం అభినందన తీర్మానంపై గురువారం దిగువ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పార్టీ ఫిరాయించారని విపక్ష నేత చంద్రబాబు చెప్పడం .గతంలో హత్యలు జరిగాయి కాబట్టి నేనూ హత్యలు చేస్తా.. అది తప్పు కాదు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారశైలి ఉందని’ ఎద్దేవా చేశారు. ‘ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైకాపా ఎమ్మెల్యేల్ని తెదేపాలో చేర్చుకుని తప్పు చేసారు. ఇప్పుడు ఆ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పకుండా అనవసర విషయాలు చెబుతున్నార’ని ఆగ్రహించారు. ‘చంద్రబాబు మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. సభాపతి గారూ మీరు అనుమతిస్తే చంద్రబాబు గురించి ఆయనకు సొంత కూతురిని ఇచ్చిన ఎన్టీఆర్ చెప్పిన విషయాలను సభలో టీవీలో చూపిస్తామని జగన్ విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos