వైఎస్ జగన్ సూచనలు లెక్కచేయని మంత్రులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాలను మంత్రులు ఏమాత్రం లెక్కచేయడం లేదనే విషయం మరోసారి బహిర్గతమైంది.గత తెదేపా ప్రభుత్వ హాయాంలో మంత్రుల పేషీల్లో పని చేసిన సిబ్బంది కొనసాగించరాదంటూ సూచించినా 13 మంది మంత్రులు పాత సిబ్బందినే కొనసాగిస్తున్నారనే విషయం బయటపడింది.గత తెదేపా ప్రభుత్వ హయాంలో పని చేసిన సిబ్బందిని తమ ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తే గత ప్రభుత్వ ప్రభావం తమ ప్రభుత్వంపై పడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గత ప్రభుత్వంలో మంత్రుల పేషీల్లో పని చేసిన సిబ్బందిని కొనసాగించవద్దంటూ ఆదేశించారు.దీంతో ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లాం మంత్రివర్గం ఏర్పాటైన వెంటనే గత ప్రభుత్వ హయాంలో మంత్రుల పేషీల్లో పనిచేసినవారిని ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ), ప్రైవేట్ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా కొనసాగించవద్దని సూచించారు. తమ పేషీల్లో నియమించుకునే సిబ్బంది వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని కూడా సూచించారు.అయితే ఇవేమి పట్టించుకోని 13 మంది మంత్రులు గత ప్రభుత్వంలోని ఉద్యోగులను తమ పేషీల్లో కొనసాగిస్తున్నారు.ప్రజలతో,అధికారులతో మర్యాదపూర్వకంగా,స్నేహపూర్వకంగా మెలగాలంటూ సూచించినా మంత్రులు,ఎమ్మెల్యేలు అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు సైతం కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos