ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నాయకుడు. 2004లో బీజేడీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బిశ్వభూషణ్ ప్రముఖ న్యాయవాది. జనసంఘ్, జనతా పార్టీలో పనిచేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా శాఖ అధ్యక్షుడుగా పని చేశారు. 1988లో జనతాపార్టీలో, మళ్లీ 1996లో భాజపాలో చేరారు. బిశ్వభూషణ్ కవి కూడా. ఒడియాలో ఆయన పలు గ్రంథాలు రాశారు. మారుబటాస్, రాణా ప్రతాప్, శేషజలక్, అస్తశిఖ, మానసి గ్రంథాలను రాశారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన ఆయన చిలికా, భువనేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకు ఈఎస్ఎల్. నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. కాగా చత్తీస్‌గఢ్‌ గవర్నర్అ‌గా నసూయ ఊకేను నియమించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos